ఖతర్‌లో బందీగా తెలుగు మహిళ

ప్రకాశం జిల్లా వేటపా లెం మండలం రామన్నపేట పంచాయతీ వినాయకపురానికి చెందిన ఓ మహిళ.. విజిటింగ్‌ వీసాపై ఖతర్‌ దేశానికి వెళ్లి అక్కడి ఏజెంట్‌ చేతిలో బందీ అయ్యింది. ఫాతిమా స్థానికంగా చిన్న చిల్లర దుకాణం నడుపుతూ జీవనం సాగించేది.. కుటుంబం కష్టంగా ఉండటంతో అరబ్‌ దేశాలకు వెళ్లి సంపాదించాలని భావించింది. తనకు తెలిసిన అజీజ్‌ అనే వ్యక్తి ద్వారా మంగళగిరికి చెందిన షేక్‌ మహబూబ్‌ సుభానీ అనే విదేశాలకు పంపే ట్రావెలింగ్‌ ఏజెంట్‌ను ఆశ్రయించింది. దీంతో మంగళగిరి ఏజెంట్‌ గత ఏడాది అక్టోబరు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఖతర్‌కు పంపించాడు. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. అయితే.. మాకు ఫొటోలో చూపిన వ్యక్తివి నీవు కావుఅంటూ ఆమెను హింసించటం మొదలు పెట్టారు. వారి వేధింపులు భరించలేక స్థానిక ఏజెంట్‌ కార్యాలయానికి చేరుకోగా వారు మరో ఇంట్లో పనికి కుదిర్చారు. అక్క డా వేధింపులు ఎదురవడంతో తనను ఇండియా పంపించాలని అక్కడి ఏజెంట్‌ను కోరింది. అయితే.. రూ.లక్ష చెల్లిస్తేనే పంపుతామంటూ వారు వీసాపాస్‌పోర్టులను తీసుకుని బందీగా ఉంచినట్లు ఫాతి మా ఫోన్‌ ద్వారా ఆమె పిన్ని కరీమూన్‌,కుమారుడు ఖాజావలీతమ్ముడు మస్తాన్‌ తెలిపారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com