ఖైదీ150 దెబ్బకు రూ.31కోట్లు నష్టపడనున్న టీ-మొబైల్?

అమెరికాలో 4జీ సేవలందించే సుప్రసిద్ధ జర్మన్‌ టెలీకమ్యూనికేషన్స్‌ కంపెనీకి.. ‘ఖైదీ నంబర్‌ 150’ దెబ్బ తగిలింది. ఆ కంపెనీకి.. చిరంజీవి సినిమాకీ సంబంధమేంటంటారా? ఆ సంస్థ తమ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ‘టి-మొబైల్‌ ట్యూస్‌డేస్‌’ పేరిట యాప్ ద్వారా రెండు డాలర్లకు చిత్ర టికెట్లను తన వినియోగదారులకు అందించింది. సాధారణంగా అమెరికాలో సినిమా టికెట్ల వెల 9.15 డాలర్లుగా ఉంటుంది. 2 డాలర్లు పెట్టి ప్రేక్షకులు టికెట్లు కొనగా.. మిగతా మొత్తాన్ని టి-మొబైల్‌ సంస్థ డిసి్ట్రబ్యూటర్లకు చెల్లిస్తుంది. తద్వారా ఆ సంస్థకు ప్రచారం లభిస్తుంది. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అమెరికాలో రిలీజైన ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా టికెట్లను చిరు ఫ్యాన్స్‌ ఇబ్బడిముబ్బడిగా కొన్నారు. అమ్ముడైన టికెట్లలో 31,837 టికెట్లు.. అంటే దాదాపుగా 35 శాతం టికెట్లు టి-మొబైల్‌ ట్యూస్‌డే ఆఫర్‌లో అమ్ముడయ్యాయి. కానీ.. టికెట్‌ వెల మామూలు సినిమాల్లాగా 9.15 డాలర్లు కాదు. మనదేశంలోలా భారీగా పెంచేసి 25 డాలర్లుగా పెట్టారు. లెక్కప్రకారమైతే ఆఫర్‌లో భాగంగా ఈ 31,837 టికెట్లకూ టి-మొబైల్‌ సంస్థ ప్రేక్షకులు ఇచ్చే 2 డాలర్లు పోగా ఒక్కో టికెట్‌కూ 23 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా రూ.5 కోట్లకు సమానం. 31 వేలకు పైగా టికెట్లు అమ్ముడు కావడం, టికెట్‌ వెల 25 డాలర్లు కావడంతో ఆ సంస్థ అప్రమత్తమై అంతర్గత దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ ఆ సంస్థ గనక పెంచిన ధరతో తమక సంబంధం లేదని.. ఎప్పటిలాగానే ఒక్కో టికెట్‌కూ 7.15 డాలర్లు మాత్రమే చెల్లిస్తామంటే.. భారీ మొత్తాలు చెల్లించి అమెరికాలో ఈ సినిమా హక్కులు తీసుకున్నవారి పరిస్థితి గల్లంతేనని చిత్రపరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి!! అప్పుడు అసలు దెబ్బ ‘టి-మొబైల్‌’కు కాక.. హక్కులు తీసుకున్నవారికి పడుతుందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com