గంట సేపు అక్కర్లేదు. అది ఫక్తు ఫాల్స్.

* అపోహ: సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.
వాస్తవం: కసరత్తులు కేవలం బరువు తగ్గడానికే కాదు. శరీరం దృఢంగా తయారవడానికీ అవసరమే. లావుగా లేకపోయినా సరే ఆరోగ్యంగా ఉండటానికి రోజూవారి దినచర్యలో కాసేపైనా వ్యాయామం చేయాల్సిందే. అంతేగానీ, లావుగా ఉన్నవాళ్లే వ్యాయామం చేయాలన్న నిబంధన లేదు.

* అపోహ: ఉన్నట్టుండి వ్యాయామం చేయడం, జిమ్‌కు వెళ్లడం మానేస్తే బరువు పెరుగుతారు.
వాస్తవం: క్రమం తప్పకుండా వ్యాయామం చేసి మధ్యలో మానేసినప్పుడు చాలా మందిలో ఇలా జరుగుతుంది. కానీ దానికి మన ఆహారంలో మార్పులు చేసుకోకపోవడమే ముఖ్య కారణం. వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. అందుకే ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవడం అలవాటవుతుంది. వ్యాయామం మానేశాక కూడా ఆహారంలో మార్పులు చేసుకోకపోతే… అవసరానికి మించిన కెలొరీలు అంది తొందరగా బరువు పెరిగిపోతాం. మితంగా ఆహారం తింటూ, ఎంతోకొంత వ్యాయామం చేస్తే సరిపోతుంది.

* అపోహ: కనీసం గంట సేపు కసరత్తులు చేస్తేనే సరైన ఫలితాలు పొందొచ్చు.
వాస్తవం : గంటసేపు వ్యాయామం చేస్తేనే మంచి ఫలితాలుంటాయనేది అపోహ మాత్రమే. చాలా మంది అంత సమయం ఉండదని వ్యాయామం చేయడమే మొదలుపెట్టరు. సమయం ఎక్కువ లేదని వ్యాయామం చేయకుండా ఉండటం కన్నా పది నిమిషాలు దొరకినా ఉపయోగించుకుంటే మంచిది. ఒకేసారి గంటసేపు కేటాయించలేకపోతే పది నిమిషాల విడతల్లో రోజులో మూడు సార్లు వ్యాయామం చేసినా మంచి ఫలితాలుంటాయని చాలా అధ్యయనాలు తేల్చాయి. ఇలా వారం మొత్తం కలిపి కనీసం 250 నిమిషాలు వ్యాయామం కోసం కేటాయిస్తే చాలు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com