గచ్చిబౌలిలో మళ్లీ అక్రమ రియల్ ఎస్టేట్

నగరంలో ఎక్కడ కాస్త స్థలం దొరికినా కబ్జాచేసి అమ్మేయడం తరచూ జరిగే విషయమే.. నగర పరిధిలో, శివార్లలో చాలాచోట్ల ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడం.. నకిలీ ధ్రువపత్రాలు జతచేసి ఈ భూములు తమవేనని చెప్పి అమ్మేసుకొని సొమ్ము చేసుకోవడమూ తెలిసిందే.. ఇప్పుడీ బాటలో… కొందరు ఇళ్ల సొసైటీల పేరు కూడా చెప్పి కూడా స్థలాలు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గచ్చిబౌలి ప్రాంతంలో రూ.వందల కోట్ల విలువైన భూములు.. తమవని చెప్పి కొందరు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు కూడా నమోదుచేశారు. ఇప్పుడు మళ్లీ చాపకింద నీరులా కొందరు భూములను అయినకాడికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు మాత్రం ఈ భూములు ప్రభుత్వానివేనిని గట్టిగా చెబుతున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ఉండే భూములు ఎంతటి విలువైనవో ఎవరికైనా తెలిసిందే. ఇక్కడ గజం భూమి రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలోనే ఇళ్ల స్థలాలు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. అల్పాదాయ వర్గాలను ఆశపెట్టి ఒక్కో ఇంటి స్థలం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ధర చెప్పి అమ్ముకుంటున్నారు. సర్వే నెంబర్లు 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 సర్వే నెంబర్ల పరిధిలో ఉండే కొంతభూమిని గుట్టుగా అమ్ముకొనే ప్రయత్నం చేస్తున్నారు. నోటరీ రిజిస్ట్రేషన్లు చేస్తామని చెపుతున్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ భూముల విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని కేసులు నమోదుచేశారు. ఇప్పుడు మళ్లీ గుట్టుగా ఈ భూమి చేతులు మారుతోందని.. ఇందులో కొందరు మధ్యతరగతి, అల్పాదాయవర్గాలకు చెందిన వారు నష్టపోతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ధరకు స్థలం దొరికితే చిన్న ఇల్లు కట్టుకోవచ్చని ఆశపడేవారు ఈ దందాలో మోసపోతున్నారని తెలిసి ఈ భూముల వివరాలపై ఆరా తీస్తే ఇవన్నీ కచ్చితంగా ప్రభుత్వ భూములేనని నిర్ధారణ అయింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com