గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత

ఏటా జనవరి 26 న రిపబ్లిక్ డే ను భారతదేశమంతటా జరుపుకుంటారు. ఇంతకూ గణతంత్రదినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికి తేడా ఏమిటో తెలుసా ? స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న భారత దేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తికి గుర్తుగా జరుపుకుంటున్నాం. రిపబ్లిక్ డేను ప్రతి ఏటా జనవరి 26న జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1950 జనవరి 26 నుంచే మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నాటి నుంచి ఇండియాను రిపబ్లిక్ గా పరిగణిస్తున్నారు. రిపబ్లిక్ అంటే గణతంత్రం అని అర్ధం. అంటే ఒక నిర్ణిత కాలానికి, ప్రజలచే ఎన్నుకున్న నాయకుడు దేశానికి అధినేతగా ఉంటాడు. వంశపారంపర్యంగా కాకుండా ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్న వారు రాజ్యాన్ని పాలిస్తే అటువంటి దేశాన్ని గణతంత్రం రాజ్యం అంటారు. నేడు మనం 68 వ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ త్రివిధ దళాల (రక్షణ, వాయు, నౌక) ల ఆధ్వర్యంలో సైనికులు అద్భుతమైన విన్యాసాలు చేస్తారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు కూడా ఉంటాయి. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ సారి వేడుకలకు అబుదాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జైద్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com