గన్నవరం నుండి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు పూర్తీ సుముఖంగా ఉన్నామంటూ మార్చి 15 తర్వాత అధికారులు ప్రకటించనున్నారు.అ తర్వాత విమానయాన, సంస్థలు సర్వీసులను విదేశాలకు ఇక్కడి నుంచే నడపోచ్చని ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ముందుకొచ్చే విమాన సంస్థలు 45రోజులు ముందు షెడ్యుల్ ను ప్రకటిస్తాయి. షెడ్యుల్ విడుదల చేసాక టిక్కెట్ల అమ్మకమ ప్రారంభమవుతుంది. మే నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి నేరుగా విదేశాలకు నడవనున్నాయి. దీనికోసం అవసరమైన సంనాడట పై విమానాశ్రయంలో నిర్వహించిన ఇమ్మేగ్రేషన్ శిక్షణ తరగతులు కార్యక్రమంలో అధికారులు చర్చింఛి నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సిద్దంగా ఉందంటూ మార్చి 15న జాయింట్ డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ డిక్లరేషన్ ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పంపించానున్నారు. ఆ తర్వాత విమానయాన సంస్థలతో ప్రభుత్వం సైతం సంప్రదింపులు జరుపుతుంది.
**గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్, భవనం సిద్దమైంది. గతంలో వినియోగించిన పాత టెర్మినల్ భావనాన్నే రూ. రెండు కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ప్రయాణికుల రాకాపోకలను అనుగుణంగా మార్పులు చేసారు. మూడంచెల భద్రతా వ్యవస్థ, అంతర్జాతీయ సేవలు అందించేందుకు వీలుగా కస్టమ్స్ , ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు, కన్వేయర్ బెల్ట్ లు, ఎక్స్ రే బ్యాగేజి యంత్రాలు పూర్తీ స్థాయిలో అమర్చారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది ఒక్కటే కొరత ఉంది. సోమవారం నుంచి పదమూడు మంది రాష్ట్ర పోలీసుసిబ్బందికి ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు అనుగుణంగా శిక్షణను ప్రారంభించారు. పాదిహేను రోజుల్లో వీరికి శిక్షణ పూర్తయి.. సేవలు అందించేందుకు సిద్దంగా ఉంటారు. ఈలోగా ఇమ్మిగ్రేషన్ సేవల కోసం కేటాయించిన కార్యాలయంలో కంప్యూటర్లు కేబుళ్లను ఏర్పాటు చేయడం పూర్తీ అవుతుంది. మరో వైపు కస్టమ్స్ విభాగం కూడా ఇక్కడి నుంచి సేవలను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. కస్టమ్స్ దీసీ శ్రీకాంత్, పారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి తదితరులు సోమావారం అంతర్జాతీయ తరపున అన్ని రకాల సిద్దంగా ఉన్నామని విమానాశ్రయ అధికారులు వారికి వివరిచ్న్హారు. ఫిబ్రవరి నెలాఖరుకు ఇమ్మిగ్రేషన్ సేవలు అందిన్సుహ్న్దుకు తాజాగా శిక్షణ తీసుకుంటున్న పదమూడు మంది సిబ్బంది సిద్దమవుతారు. అనంతరం రెండు వారాల్లో మిగతా అన్ని ఎరాప్ట్లు పూర్తీ చేసి మార్చి 15 ఏఏఐ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ విభాగాలన్ని కలిపి జాయింట్ డిక్లరేషన్ ను ప్రకటించాలని నిర్ణయించారు.
**తోలి అవకాశం ఎయిర్ ఇండియాకే
గన్నవరం విమానశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు తొల యావకాశం ఎయిర్ ఇండియాసంస్థకే ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా ముంబాయికి నడుపుతున్న సర్వీసును దుబాయి వరకూ పొడిగించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపద్యంలో తొలుత అదే విమానం ఇక్కడి నుంచి విదేశాలకు ఎగరనుంది తొలుత దుబాయ్ కు ముంబాయి మీదుగా ఈ సర్వీసును నడపనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com