గన్నవరం నుండి మొత్తం 54సర్వీసులు

దేశీయ గగన చిత్ర పటంలో విజయవాడ విమానాశ్రయం చెరగని ముద్ర వేయనుంది. దేశీయంగా, ప్రాంతీయంగా ఇక్కడి నుంచి విమానాల జాతర ప్రారంభించనుంది. ప్రాంతీయ కనెక్టివిటిలో భాగంగా విజయవాడ నుంచి కడపకు ట్రూజెట్‌ తొలి విమాన సర్వీసును గురువారం ప్రారంభించనుంది. మరో పక్క దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు తొలిదశ విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధాని ప్రాంతానికి తలమానికంగా నిలిచిన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ గగన చిత్రపటంలో గురు, శుక్రవారాల్లో మరో చరిత్రను లిఖించనుంది. దేశీయంగా, ప్రాంతీయంగా విమానాల జాతర ప్రారంభించబోతోంది. ప్రాంతీయ కనెక్టివిటీలో భాగంగా విజయవాడ నుంచి కడపకు తొలి విమాన సర్వీసు గురువారం ప్రారంభం కానుంది. ప్రాంతీయ కనెక్టివిటీలో భాగంగా ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతిలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విశాఖకు ఎయిర్‌ ఇండియా, తిరుపతికి ట్రూజెట్‌ సంస్థ విమానాలను నడుపుతోంది. తిరుపతికి సర్వీసు నడుపుతున్న ట్రూజెట్‌ సంస్థ గురువారం నుంచి కడపకు సర్వీసులను నడుపుతోంది. కడపతోపాటు హైదరాబాద్‌ రూట్‌లో కూడా ట్రూజెట్‌ తన కనెక్టవిటీని మరింత పెంచుతుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఉదయం 7.40 గంటలకు ట్రూజెట్‌ విమానం వస్తోంది. ఈ సర్వీసు కడపకు ఉదయం 8.05 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి కడప నుంచి విజయవాడకు 10.30 గంటలకు వస్తుంది. ఇదే విమానం ఇక్కడ నుంచి 10.35 గంటలకు హైదరాబాద్‌ వెళుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్‌ స్కీములో భాగంగా ట్రూజెట్‌ సంస్థ కడపకు కూడా విమానాలను నడుపుతోంది.విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం చరిత్రలో నిలవబోతోంది. దేశీయంగా మెట్రోపాలిటన్‌ నగరాల ఎయిర్‌ పోర్టులను తలదన్నేలా విజయవాడ ఎయిర్‌పోర్టు నిలవడానికి దేశీయంగా బలమైన కనెక్టివిటీ ఉండడమే కారణం. దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో, విజయవాడ నుంచి శుక్రవారం తొలిదశలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. ఇమిగ్రేషన్‌ హోదా వచ్చాక మలిదశలో ముంబయి, డిల్లీ, జైపూర్‌, కోలకతలకు గల్ప్‌, ఆసియా దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రాక, పోకలు కలిపితే మొత్తం 10 సర్వీసులను ఇండిగో నడుపుతోంది. వీటికి సంబంధించి చూస్తే హైదరాబాద్‌కు ఆరు, బెంగళూరుకు రెండు, చెన్నైలకు రెండు సర్వీసులు రాక, పోక నడపనుంది. దేశీయంగా దేశ రాజధానికి ఎయిర్‌ ఇండియా మూడు సర్వీసులను నడుపుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌గా ఒక సర్వీసును నడుపుతోంది. బెంగళూరుకు ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌ సంస్థలు విమాన సర్వీసులను నడుపుతున్నాయి. హైదరాబాద్‌కు నిర్విరామంగా సర్వీసులు నడుస్తున్నాయి. తాజాగా ఇండిగో ప్రవేశంతో దేశీయంగా బలమైన నెట్‌వర్క్‌ ఏర్పడుతోంది. విమానయాన సంస్థల మధ్య పోటీ కారణంగా ఇప్పటివరకు ఉన్న మోనోపలీ తగ్గి విమాన చార్జీల ధరలు కూడా దిగి రానున్నాయి. ఈ సర్వీసుల ప్రారంభంతో విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 54 సర్వీసులు నడుస్తున్నాయి. ఇదివరకు ఇక్కడ నుంచి 10విమాన సర్వీసులు మాత్రమే నడిచేవి. అవి ఇప్పుడు 54కు చేరుకున్నాయి. విజయవాడ నుంచి స్పైస్‌జెట్‌ సంస్థ 17 విమాన సర్వీసులు, ఎయిర్‌ ఇండియా 22 విమాన సర్వీసులు, ట్రూజెట్‌ 5 విమాన సర్వీసులు, ఇండిగో 10 విమానాలను నడుపుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com