గరికపాటి నరసింహారావు, చలసాని గాంధీలకు 2015-లోక్‌నాయక్ పురస్కారాలు

ఆంధ్ర జ్ఞానపీటికగా పేరుగాంచిన లోక్‌నాయక్ ఫౌండేషన్ 2015 పురస్కారాలను ఆ సంస్ధ వ్యవస్ధాపకులు డాక్టర్ యారల్గడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది సహితీ పురస్కారాన్ని మహాసహస్రావధాని, పండితుడు, అధ్యాపకుడు, ఉపన్యాసకుడు, ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావుకు, కార్మిక సంక్షేమ జీవన సాఫల్య పురస్కారాన్ని చలసాని గాంధీలకు అందిస్తున్నామని లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు భోయి భీమన్న, రావూరి భరద్వాజ, గొల్లపూడి మారుతీరావు, కాళీపట్నం రామారావు వంటి ప్రముఖులు అందుకున్న ఈ పురస్కారాలను ఈ ఏడాది జరగనున్న 12వ పురస్కార మహోత్సవంలో వీరిరువురుకు అందించడం సంస్ధకు మరింత గౌరవాన్ని తీసుకువస్తుందని యారల్గడ్డ పేర్కొన్నారు. సాహిత్య పురస్కారానికి లక్షా50వేలు, కార్మిక సంక్షేమ జీవన్సాఫల్య పురస్కారానికి 50వేల రూపాయిల నగదు బహుమతిని స్వర్గీయ నందమురి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకుని 2016 జనవరి 23వ తేదీన విశాఖలోని దస్‌పల్ల హోటల్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర విజిలెన్స్ కమీషనర్ సీవీసీ చౌదరి, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, గీతం సంస్ధల చైర్మన్ ఎం.వీ.వీ.ఎస్ మూర్తి చేతుల మీదుగా అందిస్తామని లక్ష్మీప్రసాద్ వివరించారు. సాహితీ సేవలే కాకుండా అనాధ వృద్ధ్ల ఆసుపత్రి ఖర్చులు, పేద వుద్యార్ధులకు విద్యాఖర్చులు భరించడం వంటి సమున్నత ఆశయాలను కూడా ఈ ఫౌండేషన్ గత పుష్కరకాలంగా నిర్విరామంగా సాగిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com