గల్లాకు సరికొత్త పదవి తెచ్చిపెట్టిన దావోస్

గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. జయదేవ్ ఎంపీగానే కాకుండా ప్రారిశ్రామిక వేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన సీఎం చంద్రబాబుతోపాటు ఏపీలో పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్ళిన విషయం విధితమే. దావోస్‌లో ప్రపంచ ఆర్దిక సదస్సు జరిగింది. అమరరాజా గ్రూపుతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారంలో గల్లా అనుభవం గడించారు. దీన్ని గుర్తించిన ప్రపంచ ఆర్దిక సదస్సు ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీస్ గవర్నర్‌ మరియు గ్లోబల్ బ్యాటరీ అలయన్స్ ప్రిన్సిపల్‌గా జయదేవ్‌ను నియమించింది. ఈ మేరకు దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఆర్దిక సదస్సులో జయదేవ్‌కు ఈ పదవులు కట్టబెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ప్రపంచ ఆర్దిక సదస్సులు జరిగినా.. గల్లా జయదేవ్ ఈ హోదా లో పాల్గొనే అవకాశం ఉంటుంది. జయదేవ్‌కు ప్రపంచ స్థాయిలో అత్యున్నత గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com