గవర్నర్ కోసం 1.6కోట్లతో ప్రత్యేక బెంజ్ కారు

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కు తెలంగాణ ప్రభుత్వం కొత్త కారు సమకూర్చింది. రాజ్భవన్ విజ్ఞప్తి మేరకు రూ.1.69కోట్లతో మెర్సిడెస్ బెంజ్ ఎస్క్లాస్ 450కారును ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) అదనపు కార్యదర్శి అర్విందర్సింగ్ రాజ్భవన్లో గవర్నర్కు స్వయంగా కొత్త కారును అప్పగించారు. ప్రస్తుతం గవర్నర్ బెంజ్ కారే వాడుతున్నారు. ఐదేళ్ల కిందట కొనుగోలు చేసిన ఈ కారుకు రిపేర్లు వస్తుండటంతో కొత్త కారును కొనుగోలు చేయాలని రాజ్భవన్ అధికారులు ప్రభుత్వానికి 10 నెలల కిందట లేఖ రాశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com