గవర్నర్ గుప్పిట కర్ణాటక రాజకీయం

కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన జేడీఎస్‌ తమను ఆహ్వానించాలంటూ గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చేపనిలో పడింది. కాంగ్రెస్‌ నేతలు, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి జేడీఎస్‌ శాసనసభాపక్ష నేత కుమారస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం లోపలికి వెళ్లేందుకు అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఆయన వెంట 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితితో తొలుత కాసేపు కుమారస్వామి రాజ్‌భవన్‌ గేటు వద్ద వేచిచూశారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతతో కలిసి గవర్నర్‌ను కలిశారు. అంనతరం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని, 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు గవర్నర్‌కు లేఖను సమర్పించామన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఐక్యంగా ఉన్నట్టు గవర్నర్‌కు స్పష్టంచేశామన్నారు. దీంతోపాటు బలనిరూపణకు అవసరమైన పత్రాలను ఆయనకు సమర్పించినట్టు చెప్పారు. గవర్నర్‌ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని తాము నమ్ముతున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా సరైన నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్‌ నిర్ణయం తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిసారిస్తామని కుమారస్వామి స్పష్టంచేశారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ పక్షాన గెలిచినవారంతా తమతోనే ఉంటారన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com