“గాయత్రి”

విలక్షణ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఓ విధమైన ఆసక్తి. ఈసారి ఏ తరహా పాత్రలో అలరించనున్నారోననే కుతుహలం. నాలుగు పదులు దాటిన నటజీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన ఈ మధ్య మాత్రం సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నారు. మనసుకు బాగా నచ్చిన పాత్రలనే చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన తన సొంత బేనరు లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌పై ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో తను ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ హీరోయిన్‌ పాత్ర పేరుతోనే సినిమాకి ‘గాయత్రి’ అనే టైటిల్‌ నిర్ణయించడం విశేషం. టైటిల్‌ రోల్‌ను నిఖిలా విమల్‌ పోషిస్తున్నారు. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్నారు. గురువారంతో షూటింగ్‌ పూర్తయింది. ఇందులో విష్ణు మంచు ఓ వపర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. శ్రియ ఆయన సరసన నటిస్తోంది. వీరిరువురిపై కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌, ఛాయాగ్రహణం: సర్వేశ్‌ మురారి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌కుమార్‌ ఆర్‌. సమర్పణ: ఆరియానా, వివియానా, విద్యా నిర్వాణ.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com