గాలి రావట్లేదని ఎమర్జెన్సీ డోరు తెరిచిన ఘనుడు

గాలి రావడం లేదని.. ఓ వ్యక్తి విమానం ఎమర్జెన్సీ డోర్‌ తెరిచాడు. అతడు చేసిన పనికి విమానం సుమారు పది గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. గోవా విమానాశ్రయంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం 985ను వాతావరణం అనుకూలించకపోవడంతో గోవా విమానాశ్రయానికి దారి మళ్లించారు. కొద్ది గంటలు వేచి ఉన్నప్పటికీ.. విమానం కదల్లేదు. దీంతో విమానంలో గాలి సరిగా రావడం లేదని.. ఉక్కపోతగా ఉందని ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేశాడు. వెంటనే అక్కడికి వచ్చిన సిబ్బంది డోర్‌ ఎందుకు తీశావని ప్రశ్నించారు. బిక్క మొహం వేసిన అతడు గాలి రావడం లేదని.. అందుకే తీసినట్లు చెప్పాడు. అతడు చెప్పిన సమాధానంతో సిబ్బంది అవాక్కయ్యారు. ఈ ఘటన కారణంగా విమానం సుమారు పది గంటలు ఆలస్యమైంది. ఆ వ్యక్తి తొలిసారి విమానం ఎక్కాడట. అందుకని ఏమీ తెలియక ఇలా చేసినట్లు ఎయిరిండియా సిబ్బంది తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com