గుహలోనే గర్జన

సూర్య కథానాయకుడిగా నటించిన ‘ఎస్‌ 3’ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే డిస్ట్రిబ్యూషన్‌, సాటిలైట్‌ రైట్స్‌ ద్వారా రూ. 100 కోట్ల బిజినెస్‌ చేసిందని ఆ చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజా తెలిపినట్లు సమాచారం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చేసే చిత్రం సూర్యదేనని ఈ సందర్భంగా నిర్మాత పేర్కొన్నారు. ‘సింగం’ సీక్వెల్‌లో భాగంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలుగా నటించారు.ఈ చిత్రానికి హారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటి వరకు విడుదలైన ‘ఎస్‌ 3’ ప్రచారచిత్రాలు సినిమాపై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com