గూఢచర్యంలో

ఇప్పటికీ ప్రత్యేకత చాటుకుంటున్న సీనియర్‌ కథానాయికల్లో త్రిష ఒకరు. గత ఏడాది ఆమె సినిమాలు ఒకటి కూడా విడుదల కాలేదు. ఈసారి మాత్రం అయిదు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఓ కొత్త సినిమాకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. బాలా శిష్యుడు వర్నిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కుట్రపయిర్చి’ అని పేరు పెట్టారు. నటి సురభి కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. సూపర్‌సుబ్బరాయన్‌ తదితరులు ఇతర తారాగణం. 1980లో జరిగిన ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్రిష గూఢచారిగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఆమె ఇలాంటి పాత్రలో కనిపించలేదు. శ్రీ గురుజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానరుపై వివేకానందన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రతన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. త్రిష నటించిన ‘మోహిని’, ‘గర్జనై’, ‘సదురంగ వేట్టై 2’, ‘1818’, ‘96’ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. వీటిలో అరవింద్‌స్వామితో నటించిన ‘సదురంగవేట్టై’ ఈనెల మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌సేతుపతితో కలసి నటిస్తున్న ‘96’ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com