గెలిచే చోటు వేరే ఉంది

ప్రతి ఒక్కరూ అన్ని చోట్లా గెలవాలనేం లేదు. బలాలు, బలహీనతలూ ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కొందరు తమ బలహీనతలను దాచుకోవాలని ప్రయత్నిస్తే, మరికొందరు ఏమాత్రం మొహమాటం లేకుండా బాహాటంగానే చెప్పేస్తుంటారు. ఇటీవల నటి తాప్సీ తనకున్న ఓ బలహీనతను గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ ‘‘నేను ట్రైన్డ్‌ ఆర్టిస్ట్‌ని కాదు. దర్శకుడు చెప్పేదాన్ని అర్థం చేసుకుని, దాన్నిబట్టి నేను నటిస్తాను. సెట్లో నా ఎదుటివాళ్లు నటించేదాన్ని బట్టి, నా రియాక్షన్‌ ఉంటుంది. అన్ని జోనర్లలోనూ నటిగా మంచి పేరు తెచ్చుకున్నాను. అయినా నేను ఫెయిల్‌ అయిన ఏరియా ఒకటి ఉంది. దాని పేరు ‘ఆడిషన్‌’. ఇప్పటికీ నేను ఆడిషన్‌లో సక్సెస్‌ కాలేను. వెనుక నుంచి ఎవరో నిలబడి ఏదో అందిస్తుంటే ఇప్పటికీ నేను చెప్పలేను. సినిమాల ఆడిషన్‌లో ఫెయిల్‌ అయితే ఫర్వాలేదనుకోవచ్చు (నవ్వుతూ). నేను యాడ్‌ పిల్మ్స్‌ ఆడిషన్స్‌ కూడా ఫెయిలయిన సందర్భాలున్నాయి. అంతమాత్రాన నేను మంచి నటిని కాదు అని ఎవరూ అనరు. అందుకే యువతకు నేను చెబుతున్నది ఒక్కటే. ఓడిపోవడం తప్పు కాదు. ఒక చోట ఓడిపోయినంత మాత్రాన నిరాశపడక్కర్లేదు. మనం గెలిచే చోటు ఇంకెక్కడో తప్పకుండా ఉంటుంది’’ అని అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com