గోపీతో మరోసారి

అనుష్క నటించిన చివరి రెండు సినిమాలూ భారీ ప్రాజెక్టులే. ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూనే ‘భాగమతి’ సినిమాలో నటించారు. ఈ రెండూ అనుష్కకు ఘన విజయం తెచ్చిపెట్టాయి. ‘భాగమతి’ తర్వాత అనుష్క ఏ సినిమా చేయబోతున్నారా? అని అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే అనుష్క తన తర్వాతి ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. జయేంద్ర దర్శకత్వంలో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఇందులో అనుష్కకు జోడీగా గోపీచంద్‌ నటించనున్నారట. అదే నిజమైతే గోపీచంద్‌-అనుష్క కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రమవుతుంది. వీరిద్దరూ జంటగా ‘లక్ష్యం’, ‘శౌర్యం’ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు జయేంద్ర దర్శకత్వం వహించే సినిమాను యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్‌ ‘పంతం’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని షూటింగ్‌ పూర్తవగానే జయేంద్ర సినిమా మొదలు పెడతారని ఫిలింనగర్‌ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం అనుష్క బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారట. మరోపక్క తమిళంలో జ్యోతిక, జీవి ప్రకాశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నాచియార్‌’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారట. ఇందులో జ్యోతిక పాత్రలో అనుష్క నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com