గోల్కొండలో ట్రంప్ కుమార్తె

అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక గోల్కొండ కోటను సందర్శించారు. భారీ భద్రతా వలయం మధ్య ఆమె ఈ చారిత్రక కోటకు చేరుకున్నారు. ఆమె పర్యటన నేపథ్యంలో భద్రతా అధికారులతో పాటు స్థానిక పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చారిత్రక నేపథ్యం కల్గిన ఈ కోట ప్రాశస్త్యాన్ని, విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు ఇవాంకకు వివరించనున్నారు. కోటలో ఏర్పాటుచేసిన స్టాళ్లను ఆమె పరిశీలించనున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సుకు విచ్చేసిన 1500 మంది ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలోనే ఈ రాత్రి విందు ఇవ్వనుంది. ఈ సాయత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు విందు కొనసాగనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com