గ్రీన్ కార్డులు వేగిరం చేయండి-మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు

అమెరికా పౌరసత్వం కోసం జారీ చేసే గ్రీన్‌కార్డుల కోటాను దేశాల వారీగా ఇవ్వడం నిలిపివేయాలని మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌ బ్రాడ్‌ స్మిత్‌ కోరారు. గ్రీన్‌కార్డ్‌లను మరింత ఎక్కువ సంఖ్యలో జారీ చేయాలని ఆయన తన బ్లాగ్‌లో సూచించారు. అమెరికా పౌరసత్వ విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చేపట్టనున్న శాసనపరమైన విధానాలను ఆయన స్వాగతించారు. దేశాల వారీగా కోటా ఇచ్చే విధానాన్నిరద్దు చేయాలని కోరతూ అమెరికా చట్టసభ సభ్యుడు కెవిన్‌ యెడెర్‌ సూచించిన సవరణ పెండింగ్‌లో ఉంది. కేవలం విదేశాల్లో పుట్టిన కారణంగా అత్యంత సామర్థ్యం కలిగిన వృత్తినిపుణులు అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ పౌరసత్వం కోసం దాదాపు 20 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి తగదని ఆయన హితవు పలికారు. గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటం కూడా పౌరసత్వం లభించడంలో ఆలస్యానికి దారి తీస్తోందన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com