గ్రీన్ కార్డు సమయం తగ్గనుంది

అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుఅల్కు ఇక గ్రీన్ కార్డు కష్టాలు అనున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన వలస విధానం అమల్లోకి వస్తే.. నిపుణులైన ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ ఆలస్యానికి తెరపడనుందని అద్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది. కొటా వారిగా వివిధ దేశాలకు గ్రీన్ కార్డుల కేటాయింపులు రద్దు చేయాలంటూ గత వారం రోజులుగా ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తూ వైట్ హౌస్ ముందు ఆందోళనకు దిగారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు వాషింగ్టన్ కు చేరుకొని ట్రంప్ సర్కారు , అమెరికన్ కాంగ్రెస్ సభ్యులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. ఎన్నారైల నుంచి వ్యక్తమవుతున్న నిరసన నేపద్యంలో వైట్ హౌస్ ఈ ప్రకటన జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వలస విధానం కారణంగా హెచ్ 1బీ వీసా పై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు గ్రీన్ కార్డు వాలంటే కనీసం 70 ఏళ్ళు పట్టినుంది. తాజాగా ట్రంప్ తీసుకొస్తున్న నూతన విధానం వాళ్ళ లాటరీ విధానానికి స్వస్తి పలికి, ప్రతిభకు పట్టం కట్టనున్నారు. దీనివల్ల ప్రతిభ కలిగిన భారతీయులు గ్రీన్ కార్డు కోసం నిరీక్షించే సమయం తగ్గనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com