గ్రూపుల గలాభాలో నూజివీడు వైకాపా

నూజివీడు పురపాలక పాలకవర్గామైన వైకాపాలో రెండు గ్రూపుల మధ్య తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే 27వ వార్డు కౌన్సిలరు అయిన రామిశెట్టి త్రివేణి దుర్గ రాజీనామా చేయగా మంగళవారం మరో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు తమ రాజీనామా లేఖలను పురపాలక కమిషనర్ బీ. మల్లిఖార్జునరావుకు ఇవ్వడంతో పురపాలక రాజకీయం వేడెక్కింది. నేడు 26వ వార్డు కౌన్సిలర్ పులిపాక గంగాభవాని, 29వ వార్డు కౌన్సిలర్ మేకల రమాదేవిలు తమ ఆరోగ్యం సహకరించటం లేదంటూ తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. అనంతరం వీరు విలేఖరులతో మాట్లాడుతూ గత పురపాలక ఎన్నికల సమయంలో ఒప్పందం ప్రకారం రామిశెట్టి త్రివేణి దుర్గకు ఇప్పుడు చైర్మన్ ప్రదవి ఇవ్వనందుకే నిరసనగా తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకతిన్కాహారు. మరికొందరు కూడా రాజీనామా బాట పట్టవచ్చని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా బసవా రేవతి వర్గం , రాజీనామా చేసిన తమ ప్రత్యర్ధి వర్గం కౌన్సిఅల్ర్ల రాజీనామాలను ప్రత్యెక పుర పాలక సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి అతిత్వరలో వాటిని ఆమోదించే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం. రామిశెట్టి త్రివేణి దుర్గ రాజీనామాను వెంటనే ఆమోదించటానికి బసవ రేవతి వర్గం ప్రయత్నించగా అప్పుడే తొందరపడవద్దని స్థానిక ఆదిస్థానం (ఎమ్మెల్యే ప్రతాప్) నుంచి సూచనలు రావడంతో ఆ పర్వం ఆగినట్లు తెలుస్తోంది. ఇప్పుడే మరో రెండు రాజీనామాలు రావడంతో ఇక వీటికి పుల్ స్టాప్ పెట్టడానికి రాజీనామాలు ఆమోదమే మార్గమని బసవా రేవతి వార్గంతో పాటు వైకాపా నాయకులు భావిస్తున్నట్లుగా సంచారం. మూడు రాజీనామాలు ఆమోదించినా నూజివీడులో వైకాపా పురపాలక అధికారికి ఎలాంటి దోకలేదు. ఈ కౌన్సిల్లలో 30 వార్డులు ఉండగా, 22 వార్డుల్లో వైకాపా అభ్యర్ధులు కౌన్సిలర్లుగా గెలవగా, ఎనిమిది మంది తెదేపా అభ్యర్ధులు కౌన్సిలర్ గా గెలిచారు. ఎవరికీ పదహారు మంది కౌన్సిలర్లు బలముంటే, కౌన్సిలర్ అధికారం వారిదే. త్రివేణి దుర్గ వర్గం నుంచి మరో ముగ్గురు రాజీనామాలు చేసినా సొంత బాల మీదే బసవా రేవతి అధికారాన్ని నిలబెట్టుకుంది. గత రెండు నెలల క్రితమే జిల్లా ఆదిస్థానం, ఎన్నికల ఒప్పందం అమలుకు ప్రయత్నించటం, దానికి బసవా రేవతి వర్గం రాజీనామాలు అంగీకరించకపోవటంతో పార్టీ ఆదిస్థానం చేసేది లేక ఊరుకుంది. తాజాగా పారిశుధ్య కార్మికుల కాంట్రాక్టర్ ల కోసం వైకాపాలోని ఈ రెండు వర్గాలు బీనమీల పేరుతొ వాటిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ విషయం లో కూడా ఈ రెండు గ్రూపులు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఇక ఈ కౌన్సిల్లో ఉంది ఇన్ని అవమానాలు పడేకన్నా బయటకు వెళ్ళిపోవటం మేలని భావించి, రెండో వర్గం వారు రాజీనామాలకు సిద్దపడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా పార్టీ నాయకులు ఎవరూ పిలిచి మాట్లాడకపోవడం ఆవర్గానికి పుండు మీద కారం చల్లినట్లుగా తయారైందని ప్రచారం కూడా ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com