“చంద్రబాబు కో క్యా హువా?”-కన్నాను అడిగిన మోడీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తనతో అన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దిల్లీలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన ఈ రోజు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ ‌షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మమ్మల్ని ఎందుకు దోషిగా చూపిస్తున్నారు? ఎందుకు సీఎం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు? ఆయనకు మనం అందరికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చాం. ఆయన అడిగినవన్నీ చేస్తున్నాం.. కానీ ఆయన ఎందుకిలా చేస్తున్నారో అర్థకావడంలేదు’’ అని మోదీ తనతో అన్నట్టు కన్నా వెల్లడించారు. ఇవే కాకుండా అనేక అభివృద్ధి అంశాలు తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రాష్ట్రానికి రైల్వే జోన్‌, స్టీల్‌ప్లాంట్‌, హైకోర్టు తదితర అనేక విషయాలన్నీ పరిశీలనలో ఉన్నాయని.. ఏదీ చేయబోమని తాము చెప్పలేదన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజల ముందు తమను దోషులుగా నిలబెడుతున్నారని కన్నా ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏడాదికి రూ.1000 కోట్లు కన్నా ఎక్కువ డ్రా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.3600 కోట్లు అందుతాయని కన్నా అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భాజపాను దోషిగా చూపిస్తోందని ఆరోపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com