చంద్రబాబు చెప్పలేదు. అఖిలప్రియకు మద్దతు ఇవ్వను.

మంత్రి భూమా అఖిలప్రియతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, ఇద్దరి మధ్య ఇగో సమస్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు లభించిన ప్రాధాన్యత తనకు ఇప్పుడు లభించడం లేదన్నారు. తాను అఖిల ప్రియ కోసం పని చేయనని, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆళ్లగడ్డలో తనను అడుగు పెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. తాను ఆళ్లగడ్డలోనే పుట్టానని.. కన్నతల్లిని, పుట్టిన ఊరిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిన్న జరిపిన భేటీ తనకు సంతృప్తి ఇచ్చిందన్న ఆయన …, పార్టీలో తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కుదిరిందని వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com