చక్కని చుక్క రజనీ

‘కాలా’ చిత్రంతో దక్షిణాదిన అడుగుపెట్టారు బాలీవుడ్ నటి హుమా ఖురేషీ. ఇందులో ఆమె రజనీకాంత్‌ ప్రేయసి పాత్రలో నటించారు. హుమా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. దక్షిణాదిన తొలి చిత్రంతోనే ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారని హుమా పొంగిపోతున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లో రజనీ తనతో ఎంత చక్కగా మాట్లాడేవారో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘సెట్స్‌లో రజనీ నాతో మాట్లాడుతున్నంత సేపు ఎంతో ముచ్చటగా అనిపించేది. ఆయన జెంటిల్‌మెన్‌. స్టార్‌డంను పట్టించుకోరు. ఓ నటుడిలో ఉండాల్సిన ప్రధాన లక్షణం అది. ఆయన ఎప్పుడూ నటన, తన పాత రోజుల గురించి చెప్తుంటారు. ఓ రోజు మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గురించి చాలా బాగా మాట్లాడారు. అప్పుడు నేను ఆ మాటలు రికార్డ్‌ చేయొచ్చా అని అడుగుదామనుకున్నా. రజనీ, అమితాబ్‌ ఇద్దరూ లెజెండ్సే. అలాంటిది రజనీ..బచ్చన్‌ సర్‌ గురించి అంత బాగా మాట్లాడటం నిజంగా గొప్ప విషయమే. అందుకే రజనీ అంటే అభిమానులకు అంత ఇష్టం. సినిమాలో నేను రజనీపై కేకలు వేసే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సన్నివేశం తీయాల్సి వచ్చినప్పుడు రజనీపై అలా అరవలేకపోయా. అప్పుడు ఎంతో కష్టపడ్డాను.,భయపడ్డాను. కానీ అభిమానులకు ఆ సన్నివేశం కూడా నచ్చినందుకు సంతోషించాను’ అని చెప్పుకొచ్చారు. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ‘కాలా’ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. ఆస్ట్రేలియా, అమెరికాలో కాలా మంచి టాక్‌ అందుకుంటోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com