చక్కర చేటు వెనుక చేదు రహస్యం ఇది

కేవలం రేమండ్‌ ఫ్రాన్సిస్‌ చెప్పడం మాత్రమే కాదు… చక్కెర హానికరం అని చెప్పే పరిశోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అనేక అధ్యయనాలను బట్టి ఆరోగ్యకరమైన బెల్లం, తేనె వంటి స్వీటెనర్లతో పోలిస్తే చక్కెర ఎందుకు హానికరమో చెప్పడానికి ఒక దృష్టాంతమిది… చక్కెరను ప్రాసెస్‌ చేసే ప్రక్రియలో గంధకం (సల్ఫర్‌) ఒక ప్రధానమైన రసాయనం. అంటే మనం బాణాసంచాలోనూ, టపాకాయల్లోనూ ఉపయోగించే రసాయనాన్నే చక్కెర ప్రాసెసింగ్‌లో ఉపయోగిస్తున్నామన్న మాట. కేవలం గంధకం మాత్రమే కాకుండా… మానవులకు హానికరమైన మరో 23 రసాయనాలను చక్కెర ప్రాసెసింగ్‌లో వాడతారు. చక్కెరతో ఒంట్లో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ పాళ్లు పెరుగుతాయి. తద్వారా అది గుండెజబ్బులకు తావిస్తుంది. చక్కెర వినియోగం పెరిగితే అది ఊబకాయాన్ని కలిగిస్తుంది. ఊబకాయంతో వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావన్నది తెలిసిందే. ఊబకాయం పెరగడం వల్ల వచ్చే అనర్థాల్లో ముఖ్యమైనది అధికరక్తపోటు. అంటే పరోక్షంగా చక్కెరతో మనం హైబీపీని తెచ్చిపెట్టుకుంటున్నా మన్నమాట.ఒక్కోసారి మరణానికి… లేదా మరణం తప్పినా జీవితాంతం వైకల్యంతో బాధపడేలా చేసే పక్షవాతానికి ప్రధాన కారణం చక్కెర. చక్కెర తినడం వల్ల డయాబెటిస్‌ రాకపోయినా… ఒకసారి డయాబెటిస్‌ వచ్చాక చక్కెర తినడం ఎంత ప్రాణాంతకమో అందరికీ తెలిసిన విషయమే. చాలామంది పచ్చళ్లు, వంటకాల్లో మితిమీరిన కారం లేదా మసాలాలు మాత్రమే కడుపులోని అల్సర్లకు కారణం అనుకుంటారు. కానీ చక్కెర కూడా కడుపులో అల్సర్స్‌ వచ్చేందుకు అంతే సమానంగా దోహదం చేస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com