చలికాలంలో డీ విటమిన్ తప్పనిసరి

చలి కాలంలో డీ విటమిన్ అవసరమా? అంటే 100 శాతం అవసరమే! అయితే చలి కాలానికి, డీ విటమిన్‌కు సంబంధమేంటని అనుకుంటున్నారా? అవును సంబంధం ఉంది! ఎందుకంటే చలి కాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చలి కాలంలో పగలు సూర్యుడు తక్కువ సేపు ఉంటాడు. అంతే కాకుండా ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. డీ విటమిన్ అధికంగా ఉండే సూర్యరశ్మి తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎండను సరిగా గ్రహించకపోవడం వల్ల పిల్లలతో పాటు పెద్దలకు కూడా వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చర్మ సంబంధ సమస్యలు కూడా రావొచ్చు. ఈ నేపథ్యంలో డీ విటమిన్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది. డీ విటమిన్ సల్మాన్, టునా, మెకరెల్ చేపలు, పాలు, తృణ ధాన్యాలు, గుడ్లు, ఆరెంజ్ జ్యూస్, పుట్ట గొడుగుల్లో పుష్కలంగా లభిస్తుంది. రోజుకు ఒక గ్లాస్ పాలు, ఆరెంజ్ జ్యూస్ తాగేలా చూసుకోవాలి. గుడ్డులోని పచ్చ సొనలో డీ విటమిన్ అధికంగా ఉంటుంది. కానీ తెల్ల, పచ్చ సొనను లాగించేయాలి. దీంతో శరీరానికి శక్తి కూడా వస్తుంది. ప్రతి రోజు మెనూలో పై ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు సూర్యరశ్మి ఉన్న సమయంలో ఎండకు కాసేపు నిలబడటం మంచిది. చలి పెడుతుందని హాయిగా దుప్పట్లో దూరడం మంచిది కాదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com