చారిత్రక చర్చిలు ఇవే-TNI క్రిస్మస్ ప్రత్యేకం

క్రిస్మస్‌తోపాటు కొత్తసంవత్సరం వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించుకోవడానికి ప్రత్యేక ప్రాంతాలకోసం అన్వేషిస్తుంటారు చాలా మంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడిపేందుకు ఎక్కడైనా విహారించాలనే ప్రణాళిక సిద్ధంచేసుకుంటారు. క్రిస్ట్‌మస్‌ అనగానే చారిత్రక నేపథ్యం ఉన్న చర్చ్‌లు, అక్కడ కనిపించే శాంతాక్లాజ్‌లు, క్రిస్టమస్‌ ట్రీలు, విద్యుద్దీపకాంతుల్లో వెలిగే చర్చ్ లు, కేకులు ఆహా.. ఆ కోలాహాలం తలుచుకుంటేనే మనసు ఉవ్విళ్లూరుతుంది. మనదేశంలో అలాంటి చారిత్రక చర్చ్ లు చాలానే ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకుంటే అక్కడే క్రిస్టమస్‌ సెలబ్రేషన్స్‌ ఎంజారు చేయొచ్చు. అందుకే భారతదేశంలో కొన్ని హిస్టారికల్‌ చర్చ్ ల గురించి.
****బసిలికా బాన్‌ జీసస్‌ చర్చి
పాత గోవాలో ఉన్న బసిలికా బాన్‌ జీసస్‌ చర్చ్‌ ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ గా చెప్పుకుంటారు. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ ఆధ్వర్యంలో ఈ చర్చ్‌ నిర్మాణం పనులు 1594లో మొదలుపెట్టారు. 1605లో ఈ నిర్మాణం పూర్తయింది. ఎర్రని ఇటుకలు, తెల్లని గోడలతో నిర్మించిన ఈ చర్చ్‌ మొదటి చూపులోనే పర్యాటకుల మనసు దోచుకుంటుంది. నిర్మాణ శైలి అత్యద్భుతం. ఇక్కడ వేసే ప్రతి అడుగూ మర్చిపోలేని అనుభూతులను మిగుల్చుతుంది. ఈ చర్చ్‌లో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌కు సంబంధించిన అనేక వస్తువులను భద్రపరిచారు. క్రిస్టమస్‌ పండుగను ఈ చర్చ్‌లో ప్రశాంతంగా జరుపుకోవచ్చు. ఈ చర్చ్‌తోపాటు గోవాలో మొత్తంగా క్రిస్టమస్‌ సందడి మొదలైంది. దేశ విదేశాల్లో స్థిరపడ్డ గోవా ప్రజలు సైతం క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొనటానికి వస్తుంటారు. చర్చ్‌లన్నీ విద్యుద్దీపకాంతులతో మెరుస్తుంటాయి. గోవాలోని ప్రధాన షాపింగ్‌ ప్రదేశాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. ఇక్కడి చర్చ్‌లన్నీ పోర్చుగీసువారి పాలనలో నిర్మించినవే.
****సెయింట్‌ థామస్‌ కేథడ్రల్‌ చర్చి
ముంబయిలోని హార్నిమన్‌ సర్కిల్‌ ప్రాంతంలో ఉన్న సెయింట్‌ థామస్‌ కేథడ్రల్‌ చర్చ్‌ భారతదేశంలోని అతి పురాతన చర్చ్‌గా గుర్తింపు పొందింది. ఈ చర్చ్‌ను 1676లో నిర్మించినప్పటికీ, 1718 లో క్రిస్టమస్‌ పండగ నాడే ఈ చర్చ్‌ ప్రారంభమయ్యింది. చర్చిగేట్‌ తన పేరును ఈ చర్చి ద్వారానే పొందాడు. అంతేకాదు, 1616లో బంద్రాలో 400 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన సెయింట్‌ అండ్రూ చర్చి నిర్మాణంలో ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గుగని ఎంతగానో ఉపయోగపడిందట! అదే 450 సంవత్సరాల విక్టోరియా చర్చి నిర్మాణానికి కూడా ఎంతగానో దోహదపడింది.
****కేథడ్రల్‌ చర్చి
ఢిల్లీలోని కేథడ్రల్‌ చర్చ్‌ని విక్టరీ చర్చ్‌ పేరుతో కూడా పిలుస్తారు. ఈ చర్చి భారతదేశంలోనే అతి సుందరమైన చర్చిగా పేరొందింది. దీనికి హెన్రీ మేడ్‌ భవనశిల్పి. దీనిని 1927 నుంచి 1935 మధ్యలో నిర్మించారు. ఈ చర్చి చూడ్డానికి బర్తడే కేక్‌లా ఉంటుంది. దీనిపై క్యాండిల్‌ కూడా ఉంటుంది. చర్చి నలువైపులా పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది. నిజానికి, ఇది ఒక రోమన్‌ కాథలిక్‌ చర్చి. ఫాదర్‌ ల్యూక్‌ చేత సిద్ధాంతీకరింపబడింది. ప్రార్థనా స్థల భవనంలో అందమైన ఇటాలియన్‌ నిర్మాణకళ కనిపిస్తుంది. చర్చి లోపలి భాగం కూడా మెరుగుపెట్టిన రాతిగచ్చుతో, వొంపులు తిరిగిన పైకప్పుతో, విస్తారమైన శిల్పకళా తోరణాలతో మనోహరంగా ఉంటుంది. సంవత్సరం పొడవునా, ప్రత్యేక వేడుకలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈస్టర్‌, క్రిస్మస్‌ లాంటి ప్రధాన పండుగలను వైభవంగా జరుపుతారు. ప్రకృతి ప్రేమికులకు ఇది ఎంతగానో ఆకర్షిస్తుంది. కుటుంబ సమేతంగా వేడుకలు చేసుకునేందుకు కేథడ్రల్‌ చర్చ్‌ అనువైన వేదిక.
****సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చర్చి
మనదేశంలో కెల్లా ఎక్కవ సంఖ్యలో చర్చ్‌లు ఉన్న రాష్ట్రం కేరళ. అందుకే, ఇక్కడ ఏటా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటుతాయి. ఈ సమయంలో రెస్టారెంట్‌లు ఆహారపానీయాల మీద ఆఫర్లను, డిస్కౌంట్‌లను ప్రకటిస్తారు. వీధుల్లోని చర్చీలన్నీ అందంగా అలంకరించబడి రాత్రంతా తెరిచే ఉంటాయి. వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కొచ్చీలో ఉన్న సెయింట్‌ ఫ్రాన్సిన్‌ చర్చ్‌ గురించి. భారతదేశంలోని మొదటి యూరోపియన్‌ చర్చ్‌గా ఇది ప్రసిద్ధిగాంచింది. దీనిని 1503లో నిర్మించారు. ఈ చర్చీ ఎన్నో దాడులు, ఒప్పందాల సాక్షిగా ఉంది. ఈ చర్చిని ప్రస్తుతం ఓ స్మారక చిహ్నాంగా సురక్షితంగా ఉంచారు.
****కేథడ్రాల్‌ కాథలిక్‌
తూర్పు స్కాట్లాండ్‌గా పిలువబడే షిల్లాంగ్‌ మేఘాలయ రాజధానిగా ఉంది. ఇక్కడ అద్భుత కట్టడంగా పేరొందిన కేథడ్రాల్‌ కాథలిక్‌ చర్చిని సందర్శించేందుకు ఏటా పర్యాటకులు వస్తూ ఉంటారు. సుమారు మూడు లక్షలమంది వరకూ కాథలిక్కులు కేథడ్రల్‌లో ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో క్రీస్తు కథనాలతో చిత్రకళా శిలువతో 14 కేంద్రాలు ఉన్నాయి. చర్చ్‌ కిటికీలు కూడా అనేక ఆకర్షణీయమైన రంగులలో పేయింట్‌ చేసి ఉంటాయి. కేథడ్రాల్‌ పైభాగం నుంచి చర్చి శిలువ వంటి ఆకృతిని చూడవచ్చు. క్రిస్మస్‌ సమయంలో ఈ చర్చిని ఎంతో అందంగా అలంకరిస్తారు.
****క్రైస్ట్‌ చర్చి
మీరెప్పుడైనా సిమ్లాకు వెళ్లి క్రైస్ట్‌ చర్చ్‌ను వీక్షించలేదంటే మీ ప్రయాణం వృధా అయినట్లే. ఎందుకనుకుంటున్నారా? సిమ్లాలోని ప్రత్యేక ఆకర్షణగా ఈ చర్చ్‌కు మంచి పేరుంది. చర్చ్‌ను కర్నల్‌ జెటీ బొయలియో 1844లో డిజైన్‌ చేశారు. దీన్ని నిర్మించడానికి సుమారు 13 సంవత్సరాలు పట్టింది. ఈ చర్చ్‌ నాలుగుదిక్కులా ఐదు కిటీకీలు ఉన్నాయి. ఈ కిటీకీలు ఇస్రాయుల ధర్మ విశ్వాసం, నమ్మకం, దాతృత్వం, ఓర్పు, వినయానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ చర్చంతా మంచుతో కప్పేసినట్లు ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com