చికాగో గ్యాస్ స్టేషన్‌లో గుజరాత్ యువకుడి హత్య

గ్యాస్‌ స్టేషన్‌లో దోపిడీకి వచ్చిన దుండగులను అడ్డుకున్న ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని 19ఏళ్ల అర్షద్‌ వోహ్రగా పోలీసులు గుర్తించారు. అతడు గుజరాత్‌లోని నదియాడ్‌ ప్రాంతానికి చెందినవాడు. డాల్టన్‌లోని క్లార్క్‌ గ్యాస్‌ స్టేషన్‌లోకి చొరబడిన దుండగులు దోపిడీకి యత్నించారు. అయితే అక్కడే ఉన్న వోహ్ర దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే దోపిడీ దొంగలు అతడిపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వోహ్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో వోహ్ర బంధువు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దుండగులకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి 12వేల డాలర్లు ఇస్తామని అక్కడి అధికారులు రివార్డు ప్రకటించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com