చికాగో వ్యభిచారం వ్యవహారంలో తానా పాత్ర లేదు-అధ్యక్షుడు వేమన సతీష్

సినీతారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలపై తానా ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమన స్పందించారు. నిందితులతో తానాకు ఎలాంటి సంబంధంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితులు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నఖిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్టు తెలుస్తోందన్నారు. కొన్నింటిలో తానా పేరును వాడి, అక్రమ మార్గాల్లో అమెరికా వీసా పొందారన్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యురిటీ(డీహెచ్‌ఎస్‌) ఈ కేసు విచారణ ముమ్మరం చేసిందని, వారికి తానా పూర్తిగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు తానా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన తీరును వారికి వివరించినట్టు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com