చిత్తూరు మేయర్ హత్య కేసులో మరో ఇద్దరు లొంగుబాటు

చిత్తూరు మేయర్‌ అనూరాధ దంపతుల హత్య కేసులో మరో ఇద్దరు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ వెల్లడించారు. మంగళవారం చిత్తూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో మురగ, పరందామన్‌ అనే ఇద్దరు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ముగ్గురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు చింటూ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com