చిలకడ దుంపలు తప్పక తినండి

ఈ దుంప జోలికి ఎప్పుడూ వెళ్లం! అనాకారిలాగా, మట్టి అంటించుకుని ఉండే చిలగడ దుంపలు కనిపిస్తే ముఖం తిప్పేస్తాం! కానీ మరే పదార్థమూ అందించలేనన్ని పోషకాలు చిలగడ దుంపలో ఉంటాయి.
**విటమిన్‌ ఎ
చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి చేరగానే ‘విటమిన్‌ ఎ’గా మారుతుంది. ఈ విటమిన్‌ లోపంతో బాధ పడేవారు రోజుకో చిలగడ దుంప తింటే ఫలితం ‘విటమిన్‌ ఎ’ లోపంతో తలెత్తే నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
**మధుమేహం అదుపులో
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంతో పాటు, ఇన్సులిన్‌ సెన్సిటివిటీని అదుపు చేసే శక్తి చిలకడ దుంపలకు ఉంటుంది.
**క్యాన్సర్‌ నివారిణి
క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు చిలగడ దుంపల్లో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఆహారం తినడం వల్ల ఉదరం, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
**పొ్టలో పుండ్లు
ఈ దుంపలోని బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌, పొటాషియం, క్యాల్షియంలు పొట్టలో అల్సర్లను మాన్పుతాయి.
**ఆర్థ్రయిటిస్‌
ఈ దుంపలోని మెగ్నీషియం, జింక్‌, విటమిన్‌ ‘బి కాంప్లెక్స్‌’లు ఆర్థ్రయిటిస్‌ నొప్పులను తగ్గిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించిన నీటితో నొప్పిగా ఉన్న కీళ్ల మీద రుద్దినా ఫలితం ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com