చీఫ్ విప్ రేసులో పోరాటం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలిలో పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో చీఫ్‌ విప్‌, విప్ పదవులను భర్తీ చేసే అవకాశముందని సమాచారం. ఈ పదవులపై సీనియర్లతో పాటు పలువురు నాయకులు ఆశలు పెట్టుకోవడంతో పోటీ ఎక్కువగానే ఉందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ చీఫ్‌ విప్‌ రేసులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముందంజలో ఉన్నారు. బొండా ఉమామహేశ్వరరావు, కాగిత వెంకట్రావు కూడా ఈ పదవికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com