చెత్త సినిమాలు

చిత్ర పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్‌ అనేది చాలా విషయాల్లో ఉపయోగపడుతోంది. మనకు సంబంధించిన వాళ్లు చిత్ర పరిశ్రమలో ఉంటే అవకాశాలు రావడం కొంచెం సులువే. కానీ చివరగా సత్తా చాటితేనే నిలబడతారు. కానీ ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చేవాళ్లకి కొన్ని కష్టాలు తప్పవు. బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టేకు అలాంటివి తప్పలేదు.. మరి అప్పుడు ఏం చేసింది…‘‘ఎప్పటికీ ఎలాంటి చిత్రాల్లో నటించకూడదనుకున్నానో అలాంటి వాటిలో కెరీర్‌ ప్రారంభంలోనే నటించాను. ఎందుకంటే బతకడానికి అవసరమైన డబ్బు కోసం తప్పలేదు’’ అని చెప్పింది. ‘బద్లాపూర్‌’, ‘హంటర్‌’, ‘ప్యాడ్‌మ్యాన్‌’ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొన్న ఆమె ఇప్పుడు తనకు నచ్చిన సినిమాల్ని ఎంచుకోగలుగుతోంది. ‘‘ఇప్పుడు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కొన్నిసార్లు తప్పకపోయినా ఎక్కువశాతం నచ్చిన కథల్నే అంగీకరిస్తున్నాను. యుద్ధం చేయాల్సిందే…ఒక్కరోజులోనే అన్నీ సాధ్యం కావు కదా!’’అని చెప్పింది రాధిక.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com