చెన్నైలో కూచిపూడికి పట్టం

చెన్నైలో పద్మభూషణ్‌ డాక్టర్‌ వెంపటి చినసత్యం నెలకొల్పిన ‘కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ’ ప్రాంగణంలో కూచిపూడి నాట్య పితామహుడు సిద్ధేంద్ర యోగి విగ్రహాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో తమిళ భాషాభివృద్ధి శాఖ మంత్రి పాండియరాజన్‌, అన్నాడీఎంకే ఎంపీ వాసుదేవన్‌ మైత్రేయన్‌, మైలాపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌.నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. చినసత్యం పెద్ద కుమారుడు వెంకటాచలపతి, కోడలు శ్రీమొయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ… 1986లో ఎంజీఆర్‌ ఈ అకాడమీ కోసం స్థలాన్ని కేటాయించారని, అది ఈ విధంగా అభివృద్ధి చెందడం ఆనందం కలిగిస్తోందని పేర్కొన్నారు. తమిళనాట అంతా ఈ నాట్యం విలసిల్లాలని ఆకాంక్షించారు. 1963లో వెంపటి చినసత్యం ఆంధ్ర నుంచి తమిళనాడుకు వచ్చారని, పురట్చి తలైవి జయలలిత ఆయన శిష్యురాలు కావడం సంతోషంగా ఉందని అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com