చెమట కాయల మీద వెనిగర్ రాస్తే…

వేసవి కాలంలో దాదాపుగా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యల్లో చెమటకాయలు కూడా ఒకటి. వీటి వల్ల చర్మం దురద పెట్టడమే కాదు, తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. అయితే కింద ఇచ్చిన కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చెమట కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని చెమట కాయలు ఉన్న ప్రదేశంలో రాయాలి. కలబందలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చెమట కాయలను నిర్మూలించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ప్రధానంగా రోజులో అధిక శాతం వేడి వాతావరణంలో గడిపే వారికి అలోవెరా జెల్ ఎంతగానో ఉపయోగపడు
*టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని దానికి కొంత నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి చర్మంపై రాస్తే చెమట కాయలు తగ్గిపోతాయి.
*శుభ్రమైన కాటన్ క్లాత్‌ను తీసుకుని అందులో కొన్ని ఐస్ ముక్కలను వేయాలి. అనంతరం ఆ ఐస్ ప్యాక్‌ను చెమటకాయలు ఉన్న ప్రాంతంలో 15 నిమిషాల పాటు మసాజ్ చేసినట్టు రాయాలి. దీంతో వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలా చెమట కాయలు తగ్గేవరకు ప్రతి 3, 4 గంటలకు ఒకసారి ఐస్ ప్యాక్‌ను అప్లై చేస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.
*వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్‌కు చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉన్నాయి. టిష్యూ పేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న చోట అద్దాలి. ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గుముఖం పడతాయి.
*చర్మాన్ని సంరక్షించే ఎన్నో గుణాలు లవంగ నూనెలో ఉన్నాయి. కాటన్ బాల్‌ను తీసుకుని లవంగ నూనెలో ముంచి శరీరంపై రాస్తే చెమట కాయలు తగ్గుముఖం పడతాయి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
*కొద్దిగా బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాయాలి. దీని వల్ల కూడా చెమట కాయలు తగ్గుతాయి. చర్మానికి సంరక్షణ అందుతుంది.
*కొద్దిగా ఓట్స్‌ను తీసుకుని మిక్సీలో వేసి పౌడర్‌గా పట్టుకోవాలి. దాంట్లో కొంత గోరు వెచ్చని నీటిని పోయాలి. అనంతరం దాన్ని మిశ్రమంగా కలపాలి. దీన్ని చెమటకాయల మీద రాయాలి. అరగంట తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే చెమట కాయలు తగ్గుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com