జగన్ యాత్రకు అమెరికా ప్రవాసుల సంఘీభావం

ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవంబర్‌ 6 నుంచి ప్రారంభించనున్న ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో పలు చోట్ల సంఘీభావ యాత్రలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ.. పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో వాషింగ్‌టన్‌ డీసీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర ఏలూరు, రమేష్‌ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శశాంక్‌, సురేష్‌ లూరి, జనార్ధన్‌ జంపాల, రాజీవ్‌, శివ, శ్రీనివాస్‌ సిద్ధినేని, రామి రెడ్డి, కిరణ్‌, సత్య పాటిల్, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని బే ఏరియా, కాలిఫోర్నియాలోని బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక పూజలతోపాటు, అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్రకు సహాయ సహకారాలు అందించడానికి యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఒక ప్రణాళిక రూపొందించుకొని, పాదయాత్ర విజయవంతానికి తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహానేత స్వర్గీయ వైఎస్‌ఆర్‌ అభిమాని, ఎన్‌ఆర్‌ఐ ప్రముఖులు కేవీ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత రాజశేఖర రెడ్డి 2003లో మండుటెండలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని, అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా పనిచేసినట్టుగానే జగన్‌ మోహన్ రెడ్డి ప్రజల ఆశీస్సులతో 2019లో ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్‌ మధులికతో పాటు ఎన్ఆర్‌ఐ విభాగం నాయకులు ప్రవీణ్‌, సురేంద్ర అబ్బవరం, సుబ్రమణ్యం రెడ్డివారి, విజయ్‌ ఎద్దుల, అమర్‌ శ్రీధర్‌, తిరుమల రెడ్డి, నరేంద్ర అత్తునూరి, భాస్కర్‌ శివానందం, శ్రీనాథ్‌ రెడ్డి, బే ఏరియా ప్రాంతానికి చెందిన పార్టీ అభిమానులు, స్టూడెంట్‌ విభాగం నేతలు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆస్టిన్‌లో ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ విభాగం డాక్టర్‌ వింగ్‌ అధ్యక్షులు డాక్టర్‌ వాసుదేవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితోపాటు ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు సుబ్బారెడ్డి చింతకుంట, రవి బల్లాడ, పుల్లారెడ్డి, వ్యాస కుమార్‌, కొండా రెడ్డి, దేవేంద్ర, వసంత్‌ ఉయ్యూరు, హనుమంత్‌ మలిరెడ్డి, సుజిత్, కేదర్‌, పరమేశ్వర్‌ రెడ్డి, ప్రసాద్‌ గురజాల, వెంకట్‌ ఎర్రగుడి, చెంగల్‌ రెడ్డి, అశోక్‌ గూడూరు, నారాయణ రెడ్డి గండ్ర, సచి ముట్లూరు, రఘు సిద్దపురెడ్డి, ప్రదీప్‌ చౌటి, ప్రదీప్‌ లక్కిరెడ్డి, హేమంత్, మాలిక్‌ ఆవుల, మోహన్‌ రెడ్డి, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే హ్యోస్టన్‌, టెక్సాస్ ల్లోనూ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com