జగన్-రమణదీక్షితులు భేటీ

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌తో తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జగన్‌ నివాసం లోటస్‌ పాండ్‌లో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోన్న రమణదీక్షితులు ప్రతిపక్ష నేతను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ రోజు పాదయాత్రను ముగించుకొని హైదరాబాద్‌ చేరుకున్న జగన్‌ను రమణదీక్షితులు సాయంత్రం 4.15 గంటల సమయంలో కలిశారు. అయితే, వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందీ ఇంకా వెల్లడికాలేదు. స్వయంగా జగన్‌ బయటకు వచ్చి రమణదీక్షితులకు వీడ్కోలు పలికిన దృశ్యాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. గతంలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రంలోని పలువురు నేతల్ని కూడా రమణ దీక్షితులు కలిసిన విషయం తెలిసిందే. ఆయన ప్రభుత్వంపైనా, తితిదే పైనా చేస్తోన్న ప్రతి విమర్శకు, ఆరోపణకూ అధికారులు కౌంటర్‌ ఇస్తూ వస్తున్నారు. ఆయన తితిదేపై చేస్తోన్నవన్నీ నిరాధార ఆరోపణలేనని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జగన్‌తో భేటీ అనంతరం బయటకు వెళ్తూ.. తన సమస్యల్ని చెప్పుకొనేందుకు మాత్రమే ప్రతిపక్ష నేతను కలిశానంటూ రమణదీక్షితులు అక్కడి మీడియా ప్రతినిధులతో అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com