జన్మదినం నాదే కళ్యాణం ఎందుకు?

శ్రీరామ నవమి. శ్రీరాముని పుట్టినరోజు. కానీ భద్రాచలంలో ఆ రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతోంది? ఎవరు నిర్ణయించారు? చైత్రశుద్ధ నవమి రోజునే ఎందుకు కళ్యాణం నిర్వహిస్తున్నారు అనేది ఆసక్తికరం.భద్రాచలంలో రాముడు ఎప్పుడు వెలిశాడో సరైన ఆధారాలు లేవు. కానీ చైత్రశుద్ధ నవమి రోజున అంటే శ్రీరామనవమినాడే భద్రాచలంలో రాముని కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోజే రాముని కళ్యాణం జరుపుతున్నారు. దానికి కారణం ఎవరో తెలుసా? భక్త రామదాసుగా కీర్తిపొందిన మన తెలుగువాడు కంచర్ల గోపన్నే.
**భద్రాచలం పరగణాకు తహశీల్దారుగా పనిచేశారు గోపన్న. ఆ కాలంలోనే 400 ఏళ్ల క్రితం ఈ విషయంపై రామదాసు తన గురువు రఘునాద్ భట్టార్‌తోపాటు ప్రముఖ పండితులతో చర్చ నిర్వహించినట్టు తెలుస్తోంది. పాంచరాత్ర ఆగమశాస్త్రంలో ఇలా ఉంది యశ్య అవతార దివశే.. తస్య కల్యాణ ఆచరేత్.. అంటే అవతారం జరిగిన నాడే కల్యాణం చేయాలి.. అనే శ్లోకం ప్రకారం రాముడు పుట్టిన చైత్రశుద్ధ నవమి రోజునే కల్యాణం జరగాలని పండితులు రామదాసుకు సూచించారు. పండితులు సూచన మేరకే చైత్రశుద్ధ నవమినాడు అభిజిర్లగ్నంలో.. అంటూ సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చినప్పుడు కల్యాణం జరుగుతుంది. రామరాజ్యంలో ప్రజాజీవనాన్ని గుర్తుకుతెస్తూ ప్రతి ఏటా భద్రాచలంలో ఇలా కల్యాణం జరుపుతారు. లోక కల్యాణం కోసం జరిగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా హాజరవడం భక్తి పారవశ్యంలో మునగడం తెలిసిన సంగతే.
**అప్పుడే జన్మించాడట…
శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌసల్య గర్భమును చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం జన్మించాడు. అందువలన ప్రతీ సంవత్సం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తుంటారు. అతనికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీమహా విష్ణువు అతనిని సంహరించడానికి నరుడై జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్ముణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్ర్నలుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగారు. ఒక రోజు పార్వతీ దేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, ‘ఓ పార్వతీ!నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా! ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేసాడు.
**ఫలితం వస్తోంది…
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే చాలు ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకురుడే ఈ తారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారి సథ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మానవులకు ‘రామనా స్మరణ’ జ్ఝానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. ‘రామ’ యనగా రమించుట అని అర్ధం. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేశారు.
**శ్రీరామ నవమి నాడు రామునికి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు. భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్టప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు, పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com