జమ్మూలో పెళ్లి

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి వారం రోజుల్లో పెళ్లి కుమార్తె కాబోతున్నారు. ఈ ఐఎఎస్ పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వాటన్నింటికీ పుల్‌స్టాప్ పడేలా పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 18న ఐపీఎస్ సమీర్‌‌శర్మతో ఏడగులు వేయనుంది అమ్రపాలి. కాగా పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌‌శర్మను ఆమ్రపాలి పెళ్లి చేసుకోబోతున్నారు. సమీర్‌‌శర్మ ప్రస్తుతం డయ్యూ-డామన్‌లో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 18 సమీర్‌‌ సొంత రాష్ట్రం జమ్ముకాశ్మీర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరుగనుంది. ఫిబ్రవరి 15వ తేది నుంచి మార్చి 7 వరకు ఆమ్రపాలి సెలవులో ఉండబోతున్నారు. పెళ్లి జమ్ములో జరుగుతున్నప్పటికీ, ఇక్కడి సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు ఆమె ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23వ తేదీన వరంగల్‌లో 25న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు హోటల్స్ బుక్ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు తన భర్త సమీర్‌తో ఆమె టర్కీ పర్యటనకు వెళ్లనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com