జయలలిత ఆస్తులను జాతికి అంకితం ఇవ్వండి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని తమిళనాడుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది. డిసెంబర్‌ 5న మృతిచెందిన జయలలితకు వారసులెవరూ లేని కారణంగా ఆమె ఆస్తులను జాతీయం చేయాలని, ఈ వ్యవహారం అంతా నిర్వహించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని దరఖాస్తుదారు కోరారు. ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు జయ ఆస్తుల వివరాలను పొందుపరుస్తూ అఫిడవిట్‌ను కూడాపిటిషన్‌తో పాటు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com