జయలలిత స్థాయి లేదనుకుందేమో

బీఎస్పీ(బహుజన్‌ సమాజ్‌ పార్టీ) కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పలకరించడానికి వచ్చే కార్యకర్తలు మాటిమాటికీ కాళ్లకు నమస్కరిస్తున్నారని ఇక మీదట ఇలాంటి గౌరవ వందనాలు చేయకూడదని ఆదేశించారు. బీఆర్‌ అంబేడ్కర్‌, కాన్షీ రామ్‌ వంటి దళిత నేతలు నమ్మే సిద్ధాంతాలు యావత్‌ బీఎస్పీ వర్గానికి తెలియజేయాలన్న ఉద్దేశంలో మాయావతి పై విధంగా వ్యాఖ్యానించారని బీఎస్పీ కార్యకర్తలు తెలిపారు. మాయావతి అంటే బీఎస్పీ కార్యకర్తలకు ఎంతో గౌరవం ఉందని అందుకే ఆమె కన్పించినప్పుడు కాళ్లకు నమస్కరిస్తుంటారని పేర్కొన్నారు. తన కాళ్లకు నమస్కరించే బదలు కార్యకర్తలు ఒకరినొకరు ‘జై భీం’ అంటూ ఆప్యాయంగా పలకరించుకోవాలని మాయావతి కోరినట్లు తెలిపారు. ‘అసమానత్వానికి వ్యతిరేకంగా బీఎస్పీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. కార్యకర్తలు ఒకరినొకరు ‘జై భీం’ అని పలకరించుకుంటే అంబేడ్కర్‌ సిద్ధాంతాలపై మాకు ఎంతటి నమ్మకం ఉందో తెలియజేస్తుంది.’ అని అలీ అనే కార్యకర్త తెలిపారు. 2016లో సంగీత చౌదరి అనే బీఎస్పీ కార్యకర్త మాయావతి కాళ్లకు నమస్కరిస్తున్న ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం వైరల్‌గా మారింది. దాంతో ఆగ్రహించిన మాయావతి..2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు టికెట్‌ ఇవ్వలేదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com