జయేంద్ర సరస్వతి పరిస్థితి క్షేమం

అస్వస్థతకు గురైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి క్రమంగా కోలుకుంటున్నారు. విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న జయేంద్ర సరస్వతిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ టీవీ రాజు పర్యవేక్షణలో ఆంధ్రా ఆస్పత్రి వైద్యులు, చెన్నై నుంచి వచ్చిన జయేంద్ర సరస్వతి వ్యక్తిగత వైద్యులు దగ్గరుండి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆంధ్రా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నందున ఆయన్ని ప్రస్తుతానికి ఎక్కడికీ తరలించాల్సిన అవసరం లేదని వ్యక్తిగత వైద్యులు జీఎస్‌ఎన్‌ మూర్తి, సుబ్రమణ్యన్‌ తెలిపారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్యంపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండు రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని.. అనంతరం ఆయన్ని పీఠానికి తీసుకెళ్తామని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com