జానకీ దీదీ ఆశీస్సులు అమరావతికి కావాలి

తుళ్లూరు మండలం నెక్కల్లులో.. బ్రహ్మకుమారి యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి జానకి దీదీ ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 147 దేశాలు, 9వేల బ్రహ్మకుమారి సెంటర్స్ ఉన్నాయని చెప్పారు. మానసిక ఆనందం ఉంటే ఏ పని చేసినా విజయం వరిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. బ్రహ్మకుమారి సభ్యులు శాంతి పోలీసులుగా పని చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారాయణ, అయ్యన్న పాత్రుడు, పుల్లారావు, నక్కా ఆనందబాబు తదితరులు హాజరయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com