జీలకర్రతో బరువు తగ్గొచ్చు

తగ్గడానికి కొందరు భారీ కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు అనేకానేక డైట్‌ ప్లాన్‌లు ఆచరిస్తూ ఉంటారు. అయితే ‘వెయిట్‌ లాస్‌’ మెనూలో జీలకర్ర (జీరా) కూడా ఒకటని అంటున్నారు డైటీషియన్లు. ప్రతిరోజూ తప్పకుండా ఏదో ఒక రూపంలో జీరాను తీసుకుంటే బరువు తగ్గొచ్చంటున్నారు. వంటింటి మసాలాల్లో కామన్‌గా కనిపించే ఈ దినుసుతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటంటే… జీరాలో పొటాషియం, మాంగనీస్‌, ఐరన్‌, ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. ‘‘అధిక న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటితో జీరా కూడా జతకలిస్తే, త్వరగా జీర్ణం అవుతుంది. ఒకరకంగా ఇది చ్యవన్‌ప్రాశ్‌లాగా పనిచేస్తుంది’’ అంటున్నారు హెల్త్‌కేర్‌కు చెందిన మహేష్‌ జయరామన్‌. జీర్ణప్రక్రియ సరిగా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులుండవు. అందుకు జీరా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉంటుంది.జీరాలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అది శరీరంలోని అన్ని కణాల కదలికకు తోడ్పడుతుంది. శరీరంలో ఉండే అత్యధిక నీరు వల్ల ఊబకాయం వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ నీటి నిల్వలను జీలకర్ర చక్కగా నియంత్రిస్తుంది. జీరాలో ‘థైమోల్‌’ అనే కాంపౌండ్‌ ఉంటుంది. ‘ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మెటబాలిజాన్ని, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ)ని ఒక క్రమపద్ధతిలో ఉంచడానికి థైమోల్‌ ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది’ అని ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ హాస్పిటల్‌ చీఫ్‌ డైటీషియన్‌ భక్తి సామంత్‌ అంటున్నారు.ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కడుపులో మంట తగ్గినట్టే, జీరా రసాన్ని తాగినా కూడా అదే ఫలితం ఉంటుంది. కడుపులోని రసాయనాలు మనం తిన్న ఆహారాన్ని వేగంగా షుగర్‌గా మారుస్తాయి. అయితే జీరా తీసుకుంటే అది రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. సహజంగానే భారతీయ వంటకాలలో జీరాను వాడతారు. రెగ్యులర్‌ డ్రింకింగ్‌ వాటర్‌కు బదులుగా జీరా నీటిని కూడా తీసుకోవచ్చు. ఒక స్పూను జీరాను గ్లాసు నీటిలో ఉడికించాలి. గ్లాసు నీళ్లు అరగ్లాసు అయ్యేదాకా ఉడికించవచ్చు. ఆ నీటిని ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం ఆ నీటిలో కాస్త తేనె కూడా కలపొచ్చు. కడుపులో గ్యాసును పెంచే ఆలూ వంటివి వండినప్పుడు ఆ వంటకాలలో కాస్త జీరా కలిపితే మంచిది.చల్లటి మజ్జిగపై జీరా పొడిని చిలకరించి తాగొచ్చు. భోజనంలో తీసుకునే పెరుగులో వేగించిన జీలకర్రను చల్లి తినొచ్చు. పిండిలో జీలకర్ర పొడిని కలిపి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యకరమే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com