జుట్టు వ్యాపారం

నటి అమీ జాక్సన్‌ త్వరలో శిరోజాల బిజినెస్‌ ప్రారంభించబోతోంది. హిందీలో ఫ్రీకీ అలీ, తమిళంలోరోబో-2.0 చిత్రీకరణలతో బిజీగా ఉన్న అమీ ప్రస్తుతం బిజినెస్‌ విషయమై లండన్‌లో ఉంది. లండన్‌లో శిరోజాల ఎక్స్‌టెన్షన్స్‌కి, ఫేక్‌ ఐలాషెస్‌కి మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసిన వీటి ట్రెండ్‌ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బిజినెస్‌ ప్రారంభించాలనుకుంటున్నట్లు అమీ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ ఫ్రెండ్‌తో కలిసి ఈ బిజినెస్‌ను లండన్‌తో పాటు భారత్‌లోనూ ప్రారంభించబోతోంది. ముందు లండన్‌లో ఒక శాఖ ఏర్పాటుచేసి నెల తర్వాత భారత్‌కు రాబోతోంది. ఈ ఏడాది చివర్లో ఇక్కడ కూడా తన బిజినెస్‌ మొదలుపెట్టబోతున్నట్లు తెలిపింది. ఈ బిజినెస్‌తో తనకిష్టమైన రెండో రంగంలోనూ అడుగుపెట్టినట్లు ఉంటుందని అమీ పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com