జైలులోనే ఉంచండి

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ గాయకుడు శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇవాల్టితో రిమాండ్ ముగియడంతో చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 25 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. మరోవైపు గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఈ నెల 18న విచారణకు రానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com