జోల పాటలు అమ్మకు కూడా ఆరోగ్యవంతం

జోల పాటలు, లాలి పాటలతో పిల్లలకే కాదు.. తల్లికి కూడా లాభమేనంట! ప్రసవం తర్వాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలామంది మహిళలు ఒకరకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఆందోళన పడుతుంటారు. అయితే… పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా.. గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపే మహిళలల్లో మరీ తొందరగా మార్పు వస్తుందని పరిశోధకులు గుర్తించారు. ప్రతి ఎనిమిది మంది బాలింతల్లో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. గతంలో వయసు పైబడిన వారు పాటలు పాడుతూ డెమెన్షియా వంటి మానసకి రుగ్మతుల నుంచి బయటపడొచ్చని ఓ అధ్యయనాలు వెల్లడించాయి. బాలింతలకూ పాటలు మందుగా పనిచేస్తాయని చెప్పిన తొలి అధ్యయనం ఇదే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com