టమాటాల్లో అన్నీ ఆరోగ్య గుణాలే

టొమాటోలు లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ వాడే ఈ కూరగాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. టొమాటోల వాడకం వల్ల అందం సైతం ఇనుమడిస్తుంది. అందం, ఆరోగ్యానికీ టొమాటో ఎలా పనికొస్తుందంటే…
*జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం తగ్గిస్తుంది. డయేరియాను నివారిస్తుంది. పచ్చకామెర్లను నివారిస్తుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.
*కళ్లకు మంచిది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
*అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
*మధుమేహం, చర్మసమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
*రక్తప్రసరణ బాగా జరిగేలా సహకరిస్తుంది.
*కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గిస్తుంది.
*శరీరంలో ఫ్లూయిడ్స్ సమతులంగా ఉండేలా క్రమబద్ధీకరిస్తుంది.
*టాక్సిన్స్‌ను బయటకు పంపించేస్తుంది.
*వయసుపైబడ్డ ఛాయలను కనిపించనీకుండా యంగ్‌గా ఉంచుతుంది.
*కడుపులో అల్సర్లను తగ్గిస్తుంది.
*వీటిలోని రకరకాల యాంటిక్సిండెంట్లు క్యాన్సర్ నివారణలో బాగా పనిచేస్తాయి.
*విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
*గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
*వీటిల్లో పోషకాలు పుష్కలం. విటమిన్-ఎ, సి, కె అలాగే విటమిన్-బి6, పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వ టివి అధికంగా ఉన్నాయి. డైటరీ ఫైబర్‌తోపాటు పలు ఆర్గానిక్ కాంపౌడ్స్ కూడా టొమాటోల్లో ఉన్నాయి.
నిత్యం టొమాటోలను తినడం వల్ల రక్తంలో ఉన్న ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ప్రమాణాలు తగ్గుతాయి.
*టొమాటోలు తరచూ తినడం వల్ల దంతాలు, చర్మం, జుట్టు, ఎముకలకు ఎంతో మంచిది. టొమాటో జ్యూసు సన్బర్న్స్ను తగ్గిస్తుంది.
*వీటిని నిత్యం తినడం వల్ల గాల్‌స్టోన్స్ సమస్య తలెత్తదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com