టయోటా ధరలు పెరగనున్నాయి

వచ్చే నెలలో టొయోటా ధరలు మరింత ప్రియం కానున్నాయి. తయారీ ఖర్చులు ఎక్కువవడంతో వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు టొయోటా కిర్లోస్కార్‌ మోటార్‌(టీకేఎం) వెల్లడించింది. మే నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ‘తయారీ ఖర్చులు సవాల్‌గా మారుతున్నాయి. దీంతో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించాం. వచ్చే నెల ప్రారంభం నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ సంస్థ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. రాజా తెలిపారు. ఎంత వరకు పెంచాలనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం టొయోటా రూ. 5.49లక్షల నుంచి రూ. 1.41కోట్ల(ఎక్స్‌ షోరూం దిల్లీ) వరకు ఉండే వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవల దిగుమతి సుంకాలను పెంచడంతో ఆడీ, బెంజ్‌ లాంటి సంస్థలు తమ లగ్జరీ కార్లపై రూ. లక్ష నుంచి రూ. 10లక్షల వరకు ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుంచి ఆ ధరలు అమల్లోకి వచ్చాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com