టాక్ గోడపత్రిక ఆవిష్కరించిన కవిత

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో జులై 15న వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించబోయే లండన్ బోనాల జాతర పోస్టర్‌ని పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కవిత ఆలోచలనకు, ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని ఆమె అన్నారు. యూకేలో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఇతర వివరాలకు www.tauk.org.uk వెబ్ సైట్‌ని సంప్రదించవలసిందిగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్ సంస్థ ప్రతినిధులు శ్రీమతి శ్వేతా రెడ్డి, జాహ్నవి, మల్లేష్ పప్పుల, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రాజీవ్ సాగర్, నవీన్ ఆచారి, విజయ్ కోరబోయిన, రోహిత్ రావు, పసుల చరణ్ తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com